Top
logo

ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం జగన్‌ పర్యటన

ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం జగన్‌ పర్యటన
Highlights

-ఢిల్లీలో కొనసాగుతున్న జగన్‌ పర్యటన -రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చ పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై.. -కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ శేఖవత్‌తో సమావేశం -విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై కేంద్రమంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌తో భేటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంత మేర సొమ్ము ఆదా అయ్యింది.

రివర్స్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కేంద్ర జలవనరుల మంత్రికి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై చెలరేగుతున్న వివాదాలపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ సింగ్‌కు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో చర్చల అనంతరం రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా విశాఖ చేరుకొని అరకు ఎంపీ జి. మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు.

Next Story