CM Jagan: గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan Started Godrej Agrovet Limited
x

CM Jagan: గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ 

Highlights

CM Jagan: ప్రత్యక్షంగా పరోక్షంగా 2,500 మందికి ఉపాధి లభిస్తుందన్న జగన్

CM Jagan: ఓ కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు సీఎం జగన్‌. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేశారు. వీటితోపాటు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్ పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 2 వేల 500 మందికి ఉపాధి లభిస్తుందని జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories