హ్యాట్సాఫ్ టు కేసీఆర్: సీఎం జగన్

హ్యాట్సాఫ్ టు కేసీఆర్: సీఎం జగన్
x
జగన్
Highlights

దిశ నిందితుల కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు సీఎం జగన్. దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు. వారంరోజుల్లో కేసును చేధించింన తెలంగాణ పోలీసులను...

దిశ నిందితుల కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు సీఎం జగన్. దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు. వారంరోజుల్లో కేసును చేధించింన తెలంగాణ పోలీసులను సైతం అభినందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. సినిమాల్లో దోషులను చంపితే మాత్రం చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ అట ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి' అని జగన్ అన్నారు.

మహిళలకు భద్రతకు సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం వల్లే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారు. అందుకే పర్మిట్ రూమ్, బెల్ట్ షాపుల్ని రద్దు చేశామన్నారు జగన్. కోర్టుల్లో జాప్యం జరగకూడదన్నారు జగన్. మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories