టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని...

AP CM Jagan Meeting with Tech Mahindra CEO Gurnani for Investments in AP | Live News
x

టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని...

Highlights

YS Jagan - Davos Tour Highlights: ఆంధ్రా వర్సిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గుర్నాని వెల్లడి...

YS Jagan - Davos Tour Highlights: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష‌్యంగా సీఎం జగన్‌ విదేశీ టూర్‌ కొనసాగుతోంది. దావోస్‌లో రెండురోజు సీఎం బిజీబిజీగా గడిపారు. టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని జగన్ కోరారు. రాష్ట్రంలో సింగిల్‌ విండోలో అనుమతులు ఉన్నాయని ముఖ్యంత్రి స్పష‌్టం చేశారు.

విశాఖను మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ధృఢ సంకల్పంతోనే ఉన్నారని టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నాని వెల్లడించారు. సీఎం జగన్‌ కోరిక మేరకు ఆంధ్రా వర్సిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాలను పెంచేందుకు హై ఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో వర్సిటీతో కలిసి పనిచేస్తామన్నారు. ఆంధ్రా వర్సిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళిక రూపొందిస్తామన్నారు.

వరల్డ్‌ ఎకనామి్‌ ఫోరం సదస్సులో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌పై సీఎం జగన్‌ ప్రస్తావించారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని WEF పబ్లిక్ సెషన్‌లో సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా సమయంలో తీసుకున్న చర్యలను వివరించారు. వైద్య వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం గురించి తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories