PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన

AP CM Chandrababu Presents A Special Memento To PM Modi
x

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన

Highlights

PM Modi: ఏపీ కలల రాజధాని అమరవాతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు.

PM Modi: ఏపీ కలల రాజధాని అమరవాతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రదానికి మోడీకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణమరాజుతో పాటు పలువురు మంత్రులు, కూటమి ముఖ్యనేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచిహెలికాప్టర్ లో వెలగపుడి హెలిప్యాడ్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా సబా వేదికకు చేరుకున్నారు. 58 వేల కోట్ల అభినవృద్ధి పనులకు ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు. రెండు రైల్వే లైన్లను జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా సభా వేదికపై ప్రదాని మోడీని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ సన్మానించారు. ధర్మవరం శాలువను కప్పి.. ప్రత్యేక జ్ఞాపికను అంద చేశారు. మోడీ పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతం పండుగ శోభను తలపించింది. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ర్టం నలుమూలల నుంచి ప్రజలుభారీగా తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories