ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ.. రంగంలోకి దిగనున్న ఐటీ అధికారులు

ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ.. రంగంలోకి దిగనున్న ఐటీ అధికారులు
x
పి.వి.సునీల్‌కుమార్
Highlights

అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ జరపాలని ఐటీ చీఫ్ కమిషనర్‌ను ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్‌కుమార్ ఓ లేఖలో కోరారు. 106 మంది...

అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ జరపాలని ఐటీ చీఫ్ కమిషనర్‌ను ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్‌కుమార్ ఓ లేఖలో కోరారు. 106 మంది వ్యక్తులు 2018 నుంచి 2019 వరకూ జరిపిన కొనుగోళ్లపై విచారణ జరపాలన్నారు. 2లక్షలకు మించి జరిగిన అనుమాన ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఆయన ఐటీ అధికారులను కోరారు.

ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖతోపాటు ఎక్సెల్ షీట్‌లో 106 మంది వివరాలు, ల్యాండ్ అడ్రస్‌లు, సర్వే నెంబర్లను ఐటీ అధకారులకు పంపారు సునీల్‌కుమార్. ఏపీ సీఐడీ విజ్ఞప్తి మేరకు విచారణ జరిపేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories