Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు

Posani Krishnamarali
x

Posani Krishnamarali

Highlights

AP CID: సినీ నటులు పోసాని కృష్ణమురళిపై సోమవారం సీఐడీ కేసు నమోదు చేసింది.

AP CID: సినీ నటులు పోసాని కృష్ణమురళిపై సోమవారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు.ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆ ఫిర్యాదులో తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఆయన పనిచేశారు. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్ పై పోసాని తీవ్ర విమర్శలు చేసేవారని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

పోసానిపై ఫిర్యాదులు

ఈ నెల 12న పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ, జనసేన నాయకులు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories