CID: రఘురామకృష్ణరాజు పై దేశద్రోహం కేసు

AP CID Files Sedition Case Against Raghu Rama Krishnam Raju
x

రఘు రామ కృష్ణం రాజు (ఫైల్ ఇమేజ్)

Highlights

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు దేశద్రోహం కేసును నమోదు చేశారు.

CID: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో నర్సాపురం ఎపం రఘురామకృష్ణరాజు ను నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో గత అర్థరాత్రి వరకు అదనుపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు.

రఘురామరాజు పై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాలు ఇవే: ఒక పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి రఘురాజు కుట్ర పన్నారు. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడ్డారు.

రెడ్డి, క్రిస్టియన్ వర్గాలను రఘురాజు టార్గెట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు కొన్ని టీవీ చానళ్లతో కలిసి కుట్రపన్నారు. ఏబీఎన్, టీవీ5 చానళ్లు రఘురాజుకు స్లాట్స్ కేటాయించాయి. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.

మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో రఘురాజుపై కేసు నమోదు చేశారు. 124 ఏ (దేశ ద్రోహం), 153 ఏ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం), రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర), 505 (రెచ్చగొట్టడం) సెక్షన్లపై కేసు బుక్ చేశారు. ఈ కేసులలో ఏ1గా రఘురాజు, ఏ2గా టీవీ5, ఏ3గా ఏబీఎన్ చానళ్లను చేర్చారు. సీఐడీ డీజీ రిపోర్టు ఆధారంగా కేసును నమోదు చేశారు. అయితే దీనిపై రఘురామకృష్ణమ రాజు హైకోర్టు ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆ కేసు విచారణను చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories