సీఎం రమేష్ ఇంట్లో సోదాలు.. స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి

సీఎం రమేష్ ఇంట్లో సోదాలు.. స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి
x
Highlights

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన పోలీసులపై చిందులు తొక్కారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే...

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన పోలీసులపై చిందులు తొక్కారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ సోదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది స్పందించారు. రాయలసీమలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని.. అందులో భాగంగానే సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారని.. ఎన్నికల సమయంలో ఇవి సర్వసాధారణం అని స్పష్టం చేశారు.

పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోవచ్చు అని అన్నారు. కాగా కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిపై శుక్రవారం 50మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ బెడ్‌రూమ్‌లోకి సైతం ప్రవేశించి తనిఖీలు జరిపారు. పోలీసుల తీరుపై సీఎం రమేష్ మండిపడ్డారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ప్రశ్నించగా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సోదాలకు వారెంట్ అవసరం లేదన్నారు పోలీసులు. ఎస్పీ ఆదేశాలతోనే తాము సోదాలు నిర్వహించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories