స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

స్థానిక  సంస్థల ఎన్నికలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
x
Perni nani
Highlights

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలుపై కేబినెట్లో చెర్చించినట్లు తెలిపారు. వచ్చే నెల 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, నోటిఫికేషన్ వచ్చిన 15 రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని చట్టంలో మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం ఆశలు చూపి ఓటర్లను ప్రలోభపెట్టడమే కాకుండా, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. అక్రమార్కులకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు తప్పదని, ఈ నిబంధన మున్సిపల్‌ ఎన్నికలకూ వర్తిందని మంత్రి నాని హెచ్చరించారు. ఈ సమావేశంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఉచిత విద్యుత్‌ కోసం రైతు రూ.8వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు, పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి ఐదు రోజులు గడువును విధించామని మంత్రి చెప్పారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై గ్రామ సర్పంచులదే బాథ్యతని తెల్చి చెప్పారు. సర్పంచ్‌లు ఎన్నికైన వారు స్థానికంగ ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని... గిరిజన ప్రాంతాలలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, పదవులను ఎస్టీలకే కేటాయిస్తాని ఆయన అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు 15వందల కోట్లు సబ్సీడీ ఇస్తున్నట్లు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories