ఏపీ సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ

ఏపీ సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో 2020-21 బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించనుంది.

కరోనా నిరోధ చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులుపై మంత్రివర్గం చర్చించనుంది. వచ్చే మూడునెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

గత రెండ్రోజులుగా తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారిని చెక్ పోస్టుల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత సంబంధించిన అంశాలను మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories