బిగ్ బ్రేకింగ్ : వికేంద్రీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

బిగ్ బ్రేకింగ్ : వికేంద్రీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ‍్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సు లను...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ‍్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సు లను క్యాబినెట్ ఆమోదించించి. గంటపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 7 కీలక బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అంతేకాదు పలు కీలక అమాశాలపై కూడా చర్చ జరిపింది. కాగా క్యాబినెట్ సమావేశం పూర్తయిన వెంటనే శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీ అయింది. ఈ భేటీలో అజెండా ఖరారు చేయనుంది. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశంలో కీలకమైన బిల్లుల తోపాటూ, 13జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా తయారు చేసిన బిల్లును అసెంబ్లీ ఆమోదించనుంది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సందర్బంగా అమరావతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసరాల్లో సాధారణ ప్రజలను అనుమతించలేదు. ఎక్కడికెక్కడ టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ లు వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలపై అధ్యయనం చేయడం కోసం హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఆకమిటీ కూడా ఈనెల 17న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటినే ఇవాళ్టి క్యాబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు.

Andhra Pradesh Assembly Live Updates

Show Full Article
Print Article
More On
Next Story
More Stories