4న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

4న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!
x
Highlights

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, అమరావతి రాజధాని ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో 19 బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ బిల్లులను ఆచరణలోకి తీసుకురావడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గం దృష్టిపెట్టిన తెలుస్తోంది. మరోవైపు అమరావతి ప్రాంత రైతులకు నేటినుంచి కౌలు చెక్కులను పంపిణి చెయ్యాలని నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నిధులు కూడా సమకూరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories