AP Budget 2025-26: బడ్జెట్‌లో అమరావతికి పెద్దపీట

AP Budget 2025-26:Chandrababu Naidu Government Allocates RS 6000 Crores For Amaravati Capital City
x

AP Budget 2025-26: బడ్జెట్‌లో అమరావతికి పెద్దపీట

Highlights

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది.

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో రాజధాని పనుల్లో కదలిక ప్రారంభమైంది. ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టారు. 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై కేంద్రీకరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పక్కన పెట్టింది.

మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అప్పట్లో అమరావతి రాజధాని రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి.

2024 కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధులను ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర సంస్థల నుంచి రుణంగా ఇప్పించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వనుంది. వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్ మెంట్ బ్యాంక్ రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరుకు ముందుకు వచ్చాయని ఏపీ సర్కార్ 2024 నవంబర్ లో ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories