పవన్ పొత్తు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ

AP BJP Reacts to Pawan Kalyan Alliance Comments
x

పవన్ పొత్తు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ

Highlights

AP Alliance: పొత్తుల సంగతి అధిష్టానమే చూసుకుంటుందన్న ఏపీ బీజేపీ

AP Alliance: ఏపీ రాజకీయాల్లో మరోసారి పొత్తుల టాపిక్ చర్చనీయాంశంగా మారింది. పొత్తులపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మాత్రం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని కుండ బద్దలు కొట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలనేది తన కోరిక అని, దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలియదని చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ మాత్రం హై కమాండ్‌ ఎలా చెప్తే అలా అంటోంది. పొత్తుల సంగతి అధిష్టానమే చూసుకుంటుందని.. ఇప్పటికైతే ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని స్పష్టం చేసింది.

టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం జరగడం ఇదేం కొత్త కాదు. ఎప్పటినుంచో ఈ విషయంపై పవన్‌ క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. అయితే ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బీజేపీ ప్లాన్ ఉందనే వాదనలు వినిపిస్తున్న వేళ.. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌. వైసీపీని ఓడించేందుకు బీజేపీని వీడటానికి కూడా పవన్ వెనుకాడటం లేదా..? లేక బీజేపీని ఒప్పించి.. కలిపించి బరిలోకి దింపాలని చూస్తున్నారా..? అన్నది చర్చనీయంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories