Daggubati Purandeswari: ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయి

AP BJP Chief Purandeswari Criticizes YCP Sarkar
x

Daggubati Purandeswari: ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయి

Highlights

Daggubati Purandeswari: ఏపీ ప్రజలకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయింది

Daggubati Purandeswari: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ఎందుకు అలా జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. పెట్రోలియంపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించిందని... ఏపీ ప్రజలకు ఊరట నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం LPGపై రెండు వందలు, ఉజ్వల LPG కనెక్షన్లపై 4 వందలు తగ్గించిందని తెలిపారు. ఈ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నా ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories