Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు

Ap Assembly Sessions Begin, Tdp Members Besiege Speakers Podium
x

Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు

Highlights

Ap Assembly Sessions: చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ వాయిదా తీర్మానం

Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. క్వశ్చన్‌ అవర్‌తో ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీలో సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వ అవినీతి, చంద్రబాబు అరెస్ట్‌ పరిణామాలను సీఎం జగన్‌ వివరించనున్నారు. ఇక.. వైజాగ్‌ పాలనా రాజధానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం.. బీఏసీలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి టీడీపీ సభ్యుల నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.

టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ స్థానం దగ్గరకు వెళ్లి ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ సూచించినా.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్లపై పేపర్లు విసిరి.. నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు, వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు మరోసారి నినాదాలు చేశారు. దీంతో సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య అసెంబ్లీ వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories