ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. TDP సభ్యుల నినాదాలతో దద్ధరిల్లిన ఏపీ అసెంబ్లీ..

AP Assembly Session Live Updates Today
x

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. TDP సభ్యుల నినాదాలతో దద్ధరిల్లిన ఏపీ అసెంబ్లీ..

Highlights

AP Assembly Session: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ ఆందోళన

AP Assembly Session: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో గందరగోళం చోటుచేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు.. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories