ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ

ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
x
Highlights

ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో ఈ క్యాలెండర్ ని అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించారు.

ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం. డిజైన్ చేయించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని చాటిచెప్పేలా 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను చక్కగా డిజైన్ చేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories