రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

X
Highlights
15వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి ఆర్థిక మంత్రి బుగ్గన...
Krishna10 July 2019 5:36 AM GMT
15వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం అధ్యక్షతన మరికాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్జన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రబుత్వ విప్‌లు, ప్రతిపక్షం నుంచి టీడీపీ ప్రతినిధులు హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి. ఏ విధంగా జరపాలని అనే దానిపై బీఏసీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
Next Story