Top
logo

ముఖ్యమంత్రులు చర్చించేది వీటి గురించే!

ముఖ్యమంత్రులు చర్చించేది వీటి గురించే!
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌ రావు ఇవాళ మరోసారి...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌ రావు ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు నివాసమైన ప్రగతి భవన్‌కు వెళతారు. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో తన నివాసం తాడేపల్లి నుంచి బయలుదేరతారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు – అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, ఇతర పెండింగ్‌ అంశాలు అలాగే అతిముఖ్యమైన గోదావరి జలాల వినియోగంపై చర్చిస్తారు.

Next Story