హసీనాకు ఆశ్రయం కల్పిస్తే కేసులే.. పోలీసుల హెచ్చరిక..

హసీనాకు ఆశ్రయం కల్పిస్తే కేసులే.. పోలీసుల హెచ్చరిక..
x
Highlights

కర్నూలు జిల్లాలో పరారీలో ఉన్న గూడూరు తహసీల్దారు కోసం పోలీసుల వేట కొనసాగిస్తోన్నారు. హసీనాను పట్టుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు....

కర్నూలు జిల్లాలో పరారీలో ఉన్న గూడూరు తహసీల్దారు కోసం పోలీసుల వేట కొనసాగిస్తోన్నారు. హసీనాను పట్టుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎవరైనా ఆమెకు ఆశ్రయం కల్పిస్తే.. వాళ్లపైనా కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. హసీనా బంధువుల ఇళ్లలో తనీఖీలు నిర్వహించారు. ఆమె వారివద్ద లేదని తెలుసుకొని వేట కొనసాగిస్తోన్నారు. కుటుంసభ్యులను విచారించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో హసీనా ఇంటికి వస్తే కచ్చితంగా సమాచారం ఇవ్వాలని పోలీసులు వారికి చెప్పారు. కాగా సురేష్‌ అనే వ్యక్తి నుంచి తహసీల్దారు హసీనా 4 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.

దాంతో సురేష్ ఆమెకు లంచం ఇచ్చుకోలేక ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతనికి రూ. నాలుగు లక్షలు డబ్బులిచ్చి పంపారు. ఇక్కడే తహసీల్దారు హసీనా తెలివిగా వ్యవహరించారు. తనకు నమ్మకస్తుడైన బాషా అనే వ్యక్తి.. వేరే చోట ఉంటాడని అతనికి ముట్టజెప్పాలని చెప్పింది. ఆమె చెప్పినట్టే సురేష్.. బాషాకు లంచం డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనా అక్కడినుంచి జారుకుంది. అప్పటినుంచి హసీనా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories