Big Breaking: పోలవరం ప్రాజెక్టులో మరో మలుపు.. అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో జనసేన కీలకనేత పిటిషన్

Big Breaking: పోలవరం ప్రాజెక్టులో మరో మలుపు.. అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో జనసేన కీలకనేత పిటిషన్
x
Highlights

పోలవరం ప్రాజెక్టులో మరో మలుపు.. అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో జనసేన కీలకనేత పిటిషన్

పోలవరం ప్రాజెక్టులో మరో మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనసేన సీనియర్ నాయకులు పెంటపాటి పుల్లారావు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టుకు తెలిపారు పుల్లారావు. ప్రాజెక్టు వ్యయం మొదటిగా 16వేల కోట్లు ఉండగా దాన్ని 58 వేల కోట్లకు పెంచారని ఇందులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు పుల్లారావు.

Show Full Article
Print Article
Next Story
More Stories