మరో టీడీపీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు : మంత్రి అనిల్ సంచలనం

మరో టీడీపీ ఎమ్మెల్యే  రెడీగా ఉన్నారు : మంత్రి అనిల్ సంచలనం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే త్వరలో మారబోతున్నట్టు తెలిపారు. కర్నూలులో...

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే త్వరలో మారబోతున్నట్టు తెలిపారు. కర్నూలులో విలేకరుల సమావేశంలో అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీ నుండి బయటకు వచ్చారు. వంశీ.. చంద్రబాబు, లోకేష్‌లను తీవ్రంగా విమర్శించడంతో ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. రెండుసార్లు సీఎం జగన్ ను కలిసిన ఆయన త్వరలో వైసీపీలో అధికారికంగా చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి.

అయితే తాజాగా మంత్రి అనిల్.. మరో టీడీపీ ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సిపిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి ప్రకటనతో టీడీపీలో టెన్షన్ మొదలయింది. ఆ ఎమ్మెల్యే ఎవరా అని ఆరా తీస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. ఆయన ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories