వైసీపీలోకి మరో టీడీపీ నేత.. నేడు జగన్ ను కలిసే అవకాశం..

వైసీపీలోకి మరో టీడీపీ నేత.. నేడు జగన్ ను కలిసే అవకాశం..
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కొందరు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే చీరాల...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కొందరు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు లు వైసీపీ చేరారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జైరామేష్ జగన్ ను కలిసే అవకాశముంది. ఆయన విజయవాడ ఎంపీ స్థానాన్ని కోరుతున్నారు. ఆయన సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా పనిచేశారు. విజయవాడ మాజీ ఎంపీగా, విజయా ఎలక్ట్రికల్ అధినేతగా జైరామేష్ సుపరిచితమే. ఇదిలావుంటే ఈనెల 20 లోపు వైసీపీలోకి భారీగా వలసలు ఉండేటట్టు పరిస్థితి కనబడుతోంది. అమలాపురం టీడీపీ ఎంపీ కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories