పోలవరం ప్రాజెక్టులో మరో అరుదైన ఘట్టం

Another rare Moment in the Polavaram Project
x

పోలవరం ప్రాజెక్టులో మరో అరుదైన ఘట్టం

Highlights

Polavaram Project: హైడ్రాలిక్ పద్ధతి ద్వారా 48 గేట్ల నుంచి ఏక కాలంలో నీటి విడుదల

Polavaram Project: అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టులు, ఎన్నో అడ్డంకులు మరోన్నో ఇబ్బండులు దాటుకు ఒక్కో దశను దాటుకుంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీలోని పోలవరం నుంచి వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్‎లోనే గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ స్పిల్‎వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు సమర్థవంతమైన పనితీరుతో తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి‎స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి ఎత్తి 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి.

సాధారణంగా ఎక్కడైనా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ గేట్లు నిర్వహణలో బాలరిష్టాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఇక పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. ఇప్పటికే స్పిల్ వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తికావడం, ఈప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. అయితే వాటి ఎత్తడం ద్వారా హైడ్రాలిక్ పద్ధతి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించే ఛాన్సుంది. స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు, వాటిని ఎత్తడానికి అవసరమైన 96హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు. అదేవిధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు. ఇక రివర్ స్లూయిజ్ గేట్లు పోలవరం ప్రాజెక్టు లో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు కూడా ఉన్నాయి. గతేడాది ఈ గేట్ల ద్వారానే ముందుగా వచ్చిన వరదను విడుదల చేశారు. రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు త్రాగు, సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు. ఐతే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచిన అధికారులు.. స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.

ఇక పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేయడం జరిగింది. చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టు లో మాత్రం 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని విడుదల చేసేవిధంగా రూపొందించారు. అంతే కాకుండా 100ఏళ్ళ చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. వందేళ్ళలో గోదావరికి 36లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారని మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిజిఎం ఎం.ముద్దుకృష్ణ తెలిపారు. ఇక ప్రాజెక్టులోని ఒక్కో రేడియల్ గేటు 16మీటర్ల వెడల్పు, 20మీటర్ల పొడవు, 300మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యం తో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలా గోదావరికి జూలై నెలలో వరదలు రావడం 100 ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈక్రమంలో గత ఐడు రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 48 గేట్లను ఏక కాలంలో ఎత్తి వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో ఈ క్రష్ గేట్ల ఆపరేటింగ్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యినట్లైంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్లనుండి 15లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories