Guntur: వెలుగులోకి వచ్చిన మరో ఆన్‌లైన్‌ మోసం.. అప్పులు తీర్చేందుకు కిడ్నీ విక్రయానికి సిద్ధమైన యువతి..

* యువతే టార్గెట్‌గా ఆన్‌లైన్‌ మోసాలు

R Tripura Malini
Updated on: 12 Dec 2022 8:30 PM IST
Another Online Fraud That Has Recently Come To Light In Guntur
X

గుంటూరులో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఆన్‌లైన్‌ మోసం

Online Fraud: గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన విద్యార్థిని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆన్‌లైన్‌ మోసంలో 16 లక్షలు పోగొట్టుకుంది. న్యాయం చేయాలని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‎లో యువతి ఫిర్యాదు చేసింది. ఇంట్లో చెప్పకుండా ఢిల్లీ వెళ్లినట్లు తెలిపిన యువతి.. తన తండ్రి అకౌంట్‌ నుంచి విడతలుగా డబ్బులు నిందితుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపింది. చివరకు అప్పులు తీర్చేందుకు కిడ్నీ విక్రయానికి యువతి సిద్ధమైంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story