ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త..

ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన ఖాళీలను త్వరలోనే భర్తీచేయాలని ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన ఖాళీలను త్వరలోనే భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మిగిలిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సేకరించింది. ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు, ఏ పోస్టులో భర్తీ కాలేదో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రానికే పంపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రేపు లేదంటే బుధవారం ఆ వివరాలను సంబంధిత శాఖల అధికారులకు పంపి నోటిఫికేషన్‌ జారీ చేసేలా చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

కాగా రాష్ట్రంలో మొత్తం 1,26,728 గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు గాను.. ఇప్పటివరకు 1.20 లక్షల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అయితే వీరిలో లక్ష మంది అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. వీరు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. అందులో కూడా ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక కావటం.. మరికొందరు వ్యక్తిగత కారణాలతో ఇప్పటి వరకు ఉద్యోగాల్లో చేరలేదు. దాంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఎక్కువగా గ్రామ సచివాలయాల్లో పోస్టింగులు వచ్చిన వారు కొందరు తమ ఉద్యోగాలను వదులుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇదివరకు జరిపినట్టుగానే పరీక్షలు పకడ్బందీగా జరిపేలా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories