మరోసారి చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్

మరోసారి చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్
x
Highlights

మరోసారి చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ మరోసారి చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్

దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలకనాయకుడు చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. గతంలో దళిత వ్యక్తిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉండగానే పిటి వారెంట్‌ ఇచ్చి మరోసారి చింతమనేనిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పెదవేగిలో మాజీ సర్పంచ్‌ మేడికొండ కృష్ణారావును కిడ్పాప్‌ చేసి దాడి చేసిన కేసులో, కోర్టు ఎదుట ఆయనను పోలీసులు హాజరుపరిచారు. 2018లో జరిగిన సంఘటనపై తాజాగా కోర్టు అతనికి ఈ నెల 9వరకు రిమాండ్‌ విధించింది.

దీంతో చింతమనేని బెయిల్ కధ మళ్ళీ మొదటికొచ్చింది. ఈ కేసుతో కలిపి మొత్తం ఐదు కేసుల్లో చింతమనేని అరెస్ట్‌ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు అరెస్ట్ అయిన చింతమనేని తాజాగా మూడోసారి అరెస్ట్ కావడం టీడీపీలో చర్చనీయాంశయంగా మారింది. కాగా గత నెల 11వ తేదీ నుంచి 4 కేసులలో జిల్లా జైలులో టీడీపీ నేత చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories