Vijayawada: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

Vijayawada: నాలుగో రోజుకు చేరుకున్న ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Jyothi
Published on: 29 Sept 2022 11:28 AM IST
Annapurna Devi on the Fourth Day on Indrakiladri in Vijayawada
X

Vijayawada: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అమ్మ వారు నాలుగో రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆహారాన్ని ప్రసాదించే దివ్యమూర్తి అన్నపూర్ణాదేవి. అమ్మవారి ఎడమచేతిలోని బంగారు పాత్రలో అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటెతో పరమేశ్వరునికి భిక్షగా ప్రసాదించిందని ప్రతీతి. అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story