Anil Kumar Yadav: ఎన్ని జన్మలెత్తినా టీడీపీ, జనసేన అధికారంలోకి రాదు

Anil Kumar Yadav Comments On Pawan Kalyan
x

Anil Kumar Yadav: ఎన్ని జన్మలెత్తినా టీడీపీ, జనసేన అధికారంలోకి రాదు

Highlights

Anil Kumar Yadav: జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పాం

Anil Kumar Yadav: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పామన్నారు. దత్తపుత్రుడు అన్న మాటలను పవన్‌కల్యాణ్ నిన్న నిజం చేసి చూపించాడని ఎద్దేవా చేశారు. జనసేన, టీడీపీ పొత్తులను ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ఎన్ని జన్మలెత్తినా టీడీపీ, జనసేన అధికారంలోకి రాలేదని సవాల్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఏ కారణం లేకుండా జగన్‌ను 16 నెలలు జైల్లో పెడితే స్పందించని నోళ‌్లు, ఇప్పుడెందుకు లేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories