Anganwadi protest: సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. అంగన్‌వాడీ కార్యకర్తల హెచ్చరిక

Anganwadi protest: తమ డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడలో అంగన్‌వాడీల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు.

KVD Varma
Published on: 2 March 2026 9:10 PM IST
Anganwadi protest: తమ డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడలో అంగన్‌వాడీల ఆందోళన కొనసాగుతోంది.
X

Anganwadi protest

Anganwadi protest: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడలోని ధర్నా చౌక్ వేదికగా నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో, స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు చేపట్టిన 'చలో విజయవాడ' నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది.

ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని అంగన్‌వాడీలు హెచ్చరిస్తున్నారు. పండుగలు, ఇతర సెలవులను సైతం లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు.

Anganwadi protest: తమ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని, తమ డిమాండ్లపై చర్చల ద్వారా కాకుండా అధికారికంగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ మొర వినే వరకు తాము ఇక్కడే ఉంటామని, రాత్రికి కూడా ధర్నా చౌక్‌లోనే బస చేస్తామని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు.

రాబోయే గంటల్లో ప్రభుత్వం వైఖరిని బట్టి తమ తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటామని వారు వెల్లడించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోతే, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO) ముట్టడిస్తామని కూడా వారు హెచ్చరించారు. ఈ రాత్రికి ధర్నా ప్రాంతంలోనే 'వంటా వార్పు' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండు జీతాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కామెంట్స్

Anganwadi protest: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు హెల్పర్లు చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ కార్యకర్తలకు రెండుసార్లు జీతాలు పెంచిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు చెప్పిన ఎమ్మెల్యే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం 86.86 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పారు.

అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యూటీ ప్రకటించామని చెప్పిన ఎమ్మెల్యే ప్రతి నెల ఒకటో తేదీనే అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఎప్పుడొచ్చేదీ తెలీని పరిస్థితి ఉండేదని చెప్పిన ఆయన 58204 మంది అంగన్వాడి వర్కర్స్ కు 5జి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ వివరించారు.

KVD Varma

KVD Varma

Next Story