Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రసాభాసగా మారిన అంగన్వాడీల ధర్నా

Anganwadi Dharna In Srikakulam District Has Turned Into A Sensation
x

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రసాభాసగా మారిన అంగన్వాడీల ధర్నా

Highlights

Srikakulam: రెండవ రోజు ధర్నా కొనసాగిస్తున్న అంగన్వాడీలు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రెండవ రోజు అంగన్వాడీల ధర్నా రసాభాసాగా మారింది. అంగన్వాడీలు సీఐటీయు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడ వారిని అక్కడే అడ్డుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వస్తే ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారడంతో సీఐటీయూ నాయకులను, అంగన్ వాడీ కార్యకర్తలను అరెస్టులు చేశారు. ఈ తోపులాటలో కళ్యాణి అనే మహిళ స్పృహ తప్ప పడిపోయారు. అంగన్వాడి యూనియన్ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్ లో పడేసారు. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories