logo
ఆంధ్రప్రదేశ్

ఏపీలో నేడు, రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

ఏపీలో నేడు, రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
X
Highlights

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలో నేడు రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలో నేడు రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురవచ్చు. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని విపత్తుల శాఖ వెల్లడించింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Web TitleAndhrapradesh weather Update
Next Story