ఆరోగ్యభీమా పథకం అమలులో ఏపీ టాప్..జాతీయ శాంపిల్ సర్వే!

ఆరోగ్యభీమా పథకం అమలులో ఏపీ టాప్..జాతీయ శాంపిల్ సర్వే!
x
Highlights

ప్రభుత్వ ఆరోగ్యభీమా పథకం అమలులో జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. ప్రభుత్వ బీమా పథకం రాష్ట్రంలో ఎక్కువ మందికి లబ్ధి...

ప్రభుత్వ ఆరోగ్యభీమా పథకం అమలులో జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. ప్రభుత్వ బీమా పథకం రాష్ట్రంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరింది. మొత్తం 76.1 శాతం మంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటున్నారు. అయితే ప్రైవేటు బీమా పథకాలకు వెళుతున్న వారు 0.1 శాతం మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మినహా మరే రాష్ట్రంలోనూ వైద్యపరంగా ఇంతగా లబ్ధి పొందలేదని జాతీయ శాంపిల్‌ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పేదలు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. ఇక దేశంలో 85.9 శాతం మందికి ఎలాంటి బీమా వర్తించడంలేదు.

సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకం వల్ల భారీగా పాకెట్‌ ఎక్స్‌పెండిచర్‌ తగ్గింది. ఈ సర్వే ప్రకారం ఎక్కువగా క్యాన్సర్, గుండె, నరాల జబ్బులతో ఇబ్బందిపడుతున్నారని తేలింది. కాగా గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది.. కానీ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చర్యవల్ల రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. జబ్బుల సంఖ్యను 1,059 నుంచి 2వేలకు పైగా పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories