14,15 తేదీలలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

14,15 తేదీలలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు
x
Highlights

విజయవాడలోని ఆటోనగర్ హెచ్.కె.ఆర్ కన్వెన్షన్ హాలులో డిసెంబర్ 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.

కడప: విజయవాడలోని ఆటోనగర్ హెచ్.కె.ఆర్ కన్వెన్షన్ హాలులో డిసెంబర్ 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఓప్రకటనలో పేర్కొన్నారు.

14వ తేదీ ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయని, సమావేశంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు, ఉపాధ్యాయ ఉద్యమంపై చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరగనున్న దని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories