టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీసులు టాప్!

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీసులు టాప్!
x
Highlights

ఏపీ పోలీసు శాఖకు అవార్డుల పంట పడింది. టెక్నాలజీ వినియోగించడంలో ఏపీ పోలీసులు టాప్ రేటింగ్‌లో నిలిచారు. దీంతో ఏపీ పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో ఏకంగా 48 అవార్డులు వరించాయి.

ఏపీ పోలీసు శాఖకు అవార్డుల పంట పడింది. టెక్నాలజీ వినియోగించడంలో ఏపీ పోలీసులు టాప్ రేటింగ్‌లో నిలిచారు. దీంతో ఏపీ పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో ఏకంగా 48 అవార్డులు వరించాయి. మొత్తం నేషనల్ లెవల్లో 84 అవార్డులు ప్రకటించగా.. అందులో సగానికి పైగా అవార్డులు ఏపీకి దక్కడం విశేషం. వరుసగా రెండోసారి టెక్నాలజీ వినియోగంలో నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకోవడంతో ఏపీ పోలీసులను సీఎం జగన్ అభినందించారు. దిశా సంబంధిత విభాగంలో అందిస్తున్న సేవలకు ఏకంగా 5 అవార్డులు వరించాయి. కొవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక తెలంగాణ కేవలం ఒకే ఒక అవార్డుతో సరిపెట్టుకుంది. ఇక కేరళ- 9, మహారాష్ట్ర- 4, పశ్చిమ బెంగాల్- 4, తమిళనాడు- 1 అవార్డులను దక్కించుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories