ఏపీ వాహనదారులకు షాక్ : భారీగా వాహన జరిమానాల పెంపు

ఏపీ వాహనదారులకు షాక్ : భారీగా వాహన జరిమానాల పెంపు
x
Highlights

రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి...

రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి దిమ్మతిరిగే ఫైన్‌లు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ పిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు జరిమానా అమలు చేయనున్నారు. ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు విధించనున్నారు. జరిమానాలు ఇలా..

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750.

సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే - రూ. 750

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

వేగంగా బండి నడిపితే - రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష జరిమానా విధించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories