అటు ఇటు అయితే మండలి రద్దే..

అటు ఇటు అయితే మండలి రద్దే..
x
Highlights

అమరావతి కథ క్లయిమాక్స్ కి చేరింది. మూడు రాజధానులు, సీఆర్డిఏ రద్దు పై నేడు తుది నిర్ణయం ప్రకరించనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వికేంద్రీకరణపై బిల్లు...

అమరావతి కథ క్లయిమాక్స్ కి చేరింది. మూడు రాజధానులు, సీఆర్డిఏ రద్దు పై నేడు తుది నిర్ణయం ప్రకరించనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే వికేంద్రీకరణపై బిల్లు తయారు చేసింది. ఈ బిల్లును ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశం లో ఆమోదింపజేసి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సభ్యుల చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ జరపనుంది. ఒకవేళ అసెంబ్లీలో ఆమోదం పొందితే మండలికి పంపిస్తారు. ఇక్కడే ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చి పడింది. మండలిలో టీడీపీ బలం అధికంగా ఉండటంతో తీర్మానం ఆమోదం పొందుతుందా అన్న ఆసక్తి నెలకొంది. మండలిలో వైసీపీ సభ్యుల బలం 9 మాత్రమే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు ఎలాగో వైసీపీ లోనే ఉన్నారు కాబట్టి అదనంగా మరో సభ్యుడు కలిసివస్తారు.

దీంతో ప్రభుత్వ బలం 10 గా ఉంటుంది. కానీ టీడీపీ సభ్యుల బలం ఏకంగా 32 గా ఉంది. ఈ క్రమంలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ప్రభుత్వానికి కలిసివచ్చే అంశం ఏమిటంటే టీచర్స్ ఎమ్మెల్సీలు 5 ఉన్నారు. వారికి పార్టీలతో సంబంధం లేదు. పైగా వీరిలో ఒక్కరు కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలా అని అనుకూలంగానూ మాట్లాడలేదు. వీరంతా ప్రభుత్వానికే అనుకూలంగా ఓటు వేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఒకరిద్దరు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది.

మరోవైపు ఆదివారం టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. వీరిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు సమాచారం అందించారు. మిగిలిన 10 మంది మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.. తామంతా టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్న సందేశమూ ఇవ్వలేదు. పైగా వారు ఉత్తరాంధ్ర , రాయలసీమకు చెందిన సభ్యులు. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలయింది. ముందు జాగ్రత్తగా సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిన్న సాయంత్రమే విప్ జారీ చేశారు. వీరిలో ఎంతమంది విప్ తీసుకున్నారో స్పష్టత లేదు.

ఇదిలావుంటే అసెంబ్లీలో ఎలాగో ప్రభుత్వానికి బలం ఉంది కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. కానీ మండలిలో అటు ఇటు అయింది అంటే మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. బిల్లు ఆమోదం పొందకపోతే మండలి వ్యవస్థను రద్దు చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇంగ్లీష్ మీడియం స్పిరిట్ ను కూడా అర్ధం చేసుకోకుండా ఎమ్మెల్సీ లు వ్యవహరించారని.. ఉపయోగం లేని మండలి ఉంటే ఎంత ఊడితే ఎంత అనే భావనలో ప్రభుత్వం ఉంది. మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందకపోతే అసెంబ్లీలో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. దాంతో సభ్యుల్లో టెన్షన్ మొదలయింది. మొండోడనే ముద్రపడిన జగన్ అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నా తీసుకుంటారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories