ఇవాళ నా పుట్టిన రోజు.. కానీ అవి వద్దు : హోంమంత్రి సుచరిత

ఇవాళ నా పుట్టిన రోజు.. కానీ అవి వద్దు : హోంమంత్రి సుచరిత
x
Highlights

తన పుట్టిన రోజు సందర్బంగా బొకేలు, దండలు తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్బంగా...

తన పుట్టిన రోజు సందర్బంగా బొకేలు, దండలు తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్బంగా నిరుపేదలకు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె పోస్ట్ చేశారు. అందులో 'ఇవాళ నా పుట్టిన రోజును పురస్కరించుకుని సన్మానాలు, సత్కారాలు పేరుతో పూల బొకేలు, దండలు, స్వీట్ బాక్స్ లు, శాలువాలు ఖర్చు చేసి సొమ్ము వృధా చేయొద్దు. శుభాకాంక్షలు తెలిపేవారు.. సన్మానాలకు బదులుగా పుస్తకాలు ,పెన్సిల్, పెన్నులను ఇస్తే నిరుపేద విద్యార్థులకు చేయూత ఇచ్చినట్లు ఉంటుంది.' అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారామె..

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు తలా ఒక్క మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. మన ఊరు- మన చెట్టు కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ! హరిత అంద్రప్రదేశ్ ను నిర్మిద్దాం !! భవిష్యత్ తరాలకు ఆదర్శనంగా నిలుద్దాం.. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అంటూ సుచరిత క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories