ప్రభుత్వ భవనాలకు 4 రంగులు వద్దు : హైకోర్టు

ప్రభుత్వ భవనాలకు 4 రంగులు వద్దు : హైకోర్టు
x
AP High Court (File Photo)
Highlights

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ భవనాలకు 4 రంగులు వేయాలని ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర...

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ భవనాలకు 4 రంగులు వేయాలని ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాలని పోలిన రంగులు తొలగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం మట్టి రంగు చేరుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత హైకోర్టు ఆదేశాలు చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలు రంగుల వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories