హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళాలనుకుంటున్నారా? షరతులతో సర్కారు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళాలనుకుంటున్నారా? షరతులతో సర్కారు గ్రీన్ సిగ్నల్!
x
Highlights

లాక్ డౌన్ కారణం వల్ల రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్ లో ఉండిపోయిన వారు వచ్చేందుకు వీలుగా ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడవనుంది..

లాక్ డౌన్ కారణం వల్ల రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్ లో ఉండిపోయిన వారు వచ్చేందుకు వీలుగా ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడవనుంది.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించనుంది. స్వస్థలం చేరుకున్న తర్వాత ఆయా జిల్లా కేంద్రంలోని, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు అంగీకరిస్తేనే టికెట్లు ఇస్తామని ఏపీఆర్టీసీ ప్రకటించింది. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఏపీకి వస్తామంటూ.. స్పందన పోర్టల్ లో మొత్తం 13 వేల మంది అప్లై చేసుకున్నారు. అయితే వీరి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సర్వీసులను నడిపనుంది. ఈ బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్రోడ్, కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డ్, ఎల్బీనగర్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటారు. అక్కడి నుంచి మధ్యలో ఎక్కడా ఆపరు.. అయితే ఇందులో ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం ఇస్తారు. ఈ సర్వీసుల్లో కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కలిపించలేదు..

ఇక ఈ బస్సు సర్వీసులను మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఏపీ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అప్పుడే ఆర్టీసీ అధికారులు ఈ-టికెట్ బుకింగ్ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారినీ తీసుకొచ్చేందుకు కూడా బస్సు సర్వీసులు నడపే అవకాశం ఉంది. బెంగళూరులో 2,700 మంది, చెన్నైలో 1,700 మంది స్పందన పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఏపీ నుంచి వెళ్లే వారికి ఈ సర్వీసుల్లో అవకాశం ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

ఇక అత్యవసర, ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి పోలీసుశాఖ కొవిడ్-19 పేరుతో ఈ-పాస్‌‌లు జారీ చేయనుంది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories