మూడు రాజధానులపై ఈనెల 18న కీలక నిర్ణయం..?

మూడు రాజధానులపై ఈనెల 18న కీలక నిర్ణయం..?
x
Highlights

ఈ రోజు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మూడు రాజధానులపై హై పవర్ కమిటీ మొదటి నివేదిక ఇవ్వనందున కేబినెట్ సమావేశం వాయిదా పడిందని...

ఈ రోజు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మూడు రాజధానులపై హై పవర్ కమిటీ మొదటి నివేదిక ఇవ్వనందున కేబినెట్ సమావేశం వాయిదా పడిందని అధికార వర్గాలు కాసేపటి క్రితమే వెల్లడించాయి.

వాస్తవానికి ఏపీ కేబినెట్ సమావేశం నెలలో రెండవ మరియు నాల్గవ బుధవారం క్రమం తప్పకుండా జరగాల్సి ఉంటుంది. అయితే హై పవర్ కమిటీ తన మొదటి సమావేశాన్ని మంగళవారమే నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో పెద్దగా ఏమి చర్చించలేదు. దాంతో ప్రభుత్వానికి ప్రైమరీ నివేదిక ఇవ్వలేదు. ఈ క్రమంలో సమావేశం వాయిదా పడింది. మరోవైపు అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారుల భద్రత దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారమే హై పవర్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది.. కానీ కమిటీలోని మంత్రులు కొందరు అందుబాటులో లేనందున.. అది మంగళవారం జరిగింది. మరో రెండు సార్లు హై పవర్ కమిటీ సమావేశం అయిన తరువాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. అది కూడా జనవరి 17 నాటికి తుది నివేదిక వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

దాంతో తదుపరి కేబినెట్ సమావేశం తేదీని జనవరి 18 గా అధికారులు నిర్ణయించారు. అంటే మూడు రాజధానులపై ఈనెల 18న కీలక నిర్ణయం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత 21 నుంచి 23వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానులపై బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. కాగా అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ పెట్టుకోవచ్చన్నారు సీఎం జగన్. ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ వస్తాయేమోనన్న సీఎం జగన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. దాంతో అప్పటినుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటాయి. అమరావతిలోని పూర్తిస్థాయి రాజధాని ఉండాలని టీడీపీ, జనసేన కోరుతున్నాయి. ఈ మేరకు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories