ఇవాళే సెలెక్ట్ కమిటీని ప్రకటిస్తారా?

ఇవాళే సెలెక్ట్ కమిటీని ప్రకటిస్తారా?
x
Highlights

మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో దీనిపై ఏమి చెయ్యాలా అని ప్రభుత్వం ఆలోచన...

మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో దీనిపై ఏమి చెయ్యాలా అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అలాగే సీనియర్ రాజకీయ నేతలతో సీఎం సమావేశం అవుతారని తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీని ఇవాళే ప్రకటించి పది పదిహేను రోజుల్లోనే నివేదిక వచ్చేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో 20 రోజులు లేదంటే నెలరోజుల లోపే శాసన సభ మండలిని సమావేశపరచాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ రెండు బిల్లులను వీలైనంత త్వరగా ఆమోదించుకోవాలని సిద్ధమైన ప్రభుత్వానికి మండలి రూపంలో షాక్ తగిలింది. దాంతో అతి త్వరలోనే టీడీపీకి రివర్స్ పంచ్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా తొందరగానే సమావేశాలు పెట్టాలని ఆలోచన చేస్తోంది.

మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్న విచక్షధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. అంతకుముందు మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ సభ్యులు వాధించుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రెండు పార్టీల సభ్యులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందనే తెలియలేదు. చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు.

అయితే, చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధంమని పేర్కొంది ప్రభుత్వం. బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీలో యనమల రామకృష్ణుడు మాట్లాడిన దానికి, మండలిలో చైర్మన్ వ్యవహరించిన దానికి పొంతన లేదని విమర్శించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. రూల్‌ 71ని అడ్డుపెట్టుకుని సభను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. రూల్‌ 71 అనేది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని. దీని ద్వారా కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్‌ కమిటీకి పంపించాలంటే ఒక మోషన్‌ పెట్టాలని మంత్రి బుగ్గన అన్నారు.

ఇటు.. ప్రజాస్వామ్య శక్తి ఎంతటిదో, చంద్రబాబుగారి అనుభవం ఏంటో అధికార పక్షానికి ఈరోజు తెలిసొచ్చిందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును విజయవంతంగా సెలెక్ట్ కమిటీ బాట పట్టించగలిగింది తెదేపా. ఇది రాజధాని రైతుల ఆకాంక్షల బలం. అని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories