AP CS Nilam Sawhney: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు

X
Highlights
AP CS Nilam Sawhney: ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Karampoori Rajesh7 Aug 2020 5:14 PM GMT
AP CS Nilam Sawhney: ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబర్ 30న నీలం పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. మరోసారి పదవీ కాలం పొడిగించారు. తాజా ఉత్తర్వులతో డిసెంబర్ 31వరకు సాహ్ని సీఎస్‌గా కొనసాగనున్నారు.
ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని జూన్ 30న రిటైరయ్యారు. దాంతో సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని ఆమె పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం మూడు నెలలు మాత్రమే పొడిగించింది. ఇక తాజాగా మరో మూడు నెలలు పెంచాలని జగన్ సర్కార్ కోరగా కేంద్రం అనుమతిచ్చింది. దీంతో మరోసారి సాహ్ని పదవీ కాలం పొడిగించినట్లు తెలుస్తోంది.
Web TitleAP CS Nilam Sawhney Gets Extension For 3 More Months
Next Story