ఆంధ్రప్రదేశ్ తొలి సీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రస్థానం ఇది..

ఆంధ్రప్రదేశ్ తొలి సీజే జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రస్థానం ఇది..
x
Highlights

నేడు (జనవరి 1) ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ...

నేడు (జనవరి 1) ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్‌ నరసింహన్‌.. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగ్ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు గడించారు.

ఆంధ్రప్రదేశ్ తొలి సీజే ప్రవీణ్‌కుమార్‌ ప్రస్థానం ఇది..పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు హైదరాబాద్‌ లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో అలాగే ఇంటర్మీడియట్ లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం నిజాం కాలేజీ నుంచి బీఎస్‌సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 నుంచి న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి పద్మనాభరెడ్డే ఆయనకు గురువుగా మారారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్‌ లాపై పట్టు సాధించారు. 2012 జూన్‌ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్‌ 4న శాశ్వత న్యాయమూర్తిగా మొన్నటివరకు కొనసాగారు. ఇక నేటినుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తొలి చీఫ్ జస్టిస్ గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ కొనసాగనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories