కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
x
CM Jagan (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.

కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే అంశంపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులను లెక్కించి జూన్ 30 వరకు ఆర్డినెన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఆమోదించిన తర్వాత గవర్నర్‌ పంపనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈనెల 31 లోపు ఆమోదం తెలపడానికి ఆస్కారం ఉంది.

కాగా..కరోనా వైరస్ దేశం మొత్తం వ్యాపించడంతో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయం అధికార వర్గాల్లో నెలకొంది.

బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలూ వారి సహాయకులు.. అధికార సిబ్బంది.. భద్రతా సిబ్బంది.. అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో రావాల్సి వస్తుంది. దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే. బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మార్చి అఖరిలోగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతూ ఉండాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పూర్తి నెలాఖరులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ భావించింది. కానీ, కరోనా విజంభిస్తున్నా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆర్డినెన్సు తెచ్చే ఆలోచన చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories