ఏపీ మంత్రివర్గం భేటీ : కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ మంత్రివర్గం భేటీ : కీలక నిర్ణయాలు ఇవే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిన్న(శుక్రవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. చాలా రోజుకాలుగా ఎదురు చూస్తున్న ...

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిన్న(శుక్రవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. చాలా రోజుకాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు మధ్యంతర భృతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి 20శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అమరావతిలో జేఎన్‌టీయూ ఎక్స్‌టెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారంపైనా మంత్రివర్గంలో చర్చించారు. అలాగే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి హెల్త్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

అన్ని జిల్లాల్లో ఆస్పత్రుల స్థాయి పెంచాలని.. విజయనగరంలో ఏర్పాటు చేసే వర్సిటీకి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు స్మార్ట్‌ సిటీపైన కూడా చర్చ జరిగింది. ఇక గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేసే అంశంపై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories