జనపనార హ్యాండ్‌ బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే

జనపనార హ్యాండ్‌ బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే
x
Highlights

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్లాస్టిక్‌ను సమూలంగా కూల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యావరణ...

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్లాస్టిక్‌ను సమూలంగా కూల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మంగళగిరి టెర్రేస్ సెంటర్‌లో ఉచిత జనపనార హ్యాండ్‌బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ సంచుల వాడకం కాకుండా జనపనార చేసిన సంచులనే వాడాలని కోరారు. కాగా ప్లాస్టిక్ సంచులను ప్రభుత్వం నిషేధించిందని..

మంగళగిరి పట్టణంలోని ప్రతి ఇంటికి ఆదివారం నుండి జనపనార హ్యాండ్‌బ్యాగ్ ఉచితంగా ఇస్తానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మోడీ ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం విధించి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

keywords : andhra pradesh, ysrcp , mla, alla ramakrishna reddy,jute handbags,plastic, mangalgiri

Show Full Article
Print Article
More On
Next Story
More Stories