పెదనాయుడు చిననాయుడు కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయింది : వైసీపీ ఎంపీ సెటైర్లు

పెదనాయుడు చిననాయుడు కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయింది : వైసీపీ ఎంపీ సెటైర్లు
x
Chandrababu Naidu, Nara Lokesh (File Photo)
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు కురిపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు కురిపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు లేఖ రాసిన అంశాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ.. చాలా రోజులుగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఎక్కువైందని భ్రమలు, భయాలు, ఫ్యాంటసీలు, అబద్ధాలనే నిజాలుగా నమ్ముతున్నారన్నారు అని విజయసాయి విమర్శించారు.

పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. ప్లైట్‌లోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories